calender_icon.png 26 August, 2025 | 11:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పురాతన బంగారు నాణేల పేరిట మోసాలకు పాల్పడిన నలుగురి అరెస్ట్

26-08-2025 12:20:49 AM

రూ.13.2 లక్షల నగదు స్వాధీనం 

వివరాలు వెల్లడించిన సూర్యాపేట డిఎస్పి ప్రసన్నకుమార్

సూర్యాపేట,(విజయక్రాంతి): పురాతన బంగారు నాణేలు అమ్ముతామని నమ్మబలికి రూ.20 లక్షలు మోసపూరితంగా దోచుకున్న నలుగురు నిందితులను అరెస్ట్ చేసి వారివద్ద నుండి రూ.13.25 లక్షల నగదు, ఆధారాలను స్వాధీనం చేసుకున్న ఘనత చివ్వెంలలో సోమవారం జరిగింది. ఈ కేసుకి సంబంధించిన వివరాలను సోమవారం సూర్యాపేట డీఎస్పీ ప్రసన్న కుమార్ విలేకరులకు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం తుమ్మల పన్ పహాడ్ గ్రామానికి చెందిన నిమ్మన గూటి వెంకటేశ్వర్లు దురాజ్ పల్లి గ్రమశివారులో హోటల్ నిర్వహిస్తునాడు.

ఆయనకు నిందితులు ఎ1 పశుపుల గణేష్, ఏ2 ఓర్సు చంటి పాత పరిచయస్తులు. వీరిరువురు వెంకటేశ్వర్లు వద్దకు వెళ్లి మా వద్ద పాత బంగారు నాణేలు ఉన్నాయనీ తక్కువ ధరకు అమ్ముతామని తెలుపగా రూ.20 లక్షలకు బేరం కుదిరిందన్నారు. దాని ప్రకారం ఈ నెల 10వ తేదిన రూ.5 లక్షల బయనాగా ఇచ్చాదన్నారు. అలాగే మరుసారి రోజు రూ.15 లక్షల ఇచ్చాడన్నారు. డబ్బులు కట్టిన తర్వాత నాణేల అడగగా ఇవ్వకుండా మొబైల్ కు విచిత్రమైన వీడియోలు పంపి గుర్తు తెలియని వ్యక్తులు మా వద్ద నగదును దోచుకెళ్లినట్లు తెలిపారు అన్నాడు.

మోసపోయానని గుర్తించిన హోటల్ యజమాని వెంకటేశ్వర్లు చివ్వెంల పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ కేసులో భాగంగా సోమవారం 4 గురు నిందితులను దురాజుపల్లి గ్రామ శివారులో అదుపులోకి తీసుకోన్నామన్నారు. వీరి నుండి రూ.13.25 లక్షల నగదు  స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసులో మొత్తం 9 మంది ఉండగా వీరిలో పసుపుల గణేష్, ఓర్సు చంటి, ముద్దంగుల వెంకన్న, పసుపుల సత్యం అనే నగుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు  తరలించినట్లు తెలిపారు.