01-07-2025 12:19:29 AM
మంత్రి జూపల్లి కృష్ణారావు
వనపర్తి జూన్ 30 ( విజయక్రాంతి ) : విద్యాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. పాన్గల్ మండల కేంద్రంలో రూ. 85 లక్షలతో నిర్మించిన కస్తూర్బా బాలికల విద్యాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థుల్లో మంచి పౌర స్ఫూర్తిని పెం పొందించాలని ప్రభుత్వ బడుల్లో చేరికలు భారీగా పెరగాలన్నారు, ఆరోగ్యానికి యోగా, ధ్యానం, ఆత్మ రక్షణ కోసం కరాటే వంటి వాటిపై ప్రాధాన్యత ఉంచాలన్నారు. మల్లాయిపల్లిలో రూ. 10 లక్షలతో రోటరీ క్లబ్ నిర్మించిన పాఠశాల మరమ్మత్తులను కూడా ఆయన ప్రారంభించారు.