calender_icon.png 1 July, 2025 | 7:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోర్టు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

01-07-2025 12:20:54 AM

రూ.౩.౨౦ కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే ‘యెన్నం’ 

మహబూబ్ నగర్ జూన్ 30 (విజయ క్రాంతి) : జిల్లా ఉన్నత అధికారులు ప్రతిరో జు ప్రయాణించే కోర్టు రోడ్డుకు నెలల తరబడి గుంతల మయంగా మారిందని విజయ క్రాంతి దినపత్రికలో కోర్టు రోడ్డుకు మోక్షం ఎప్పుడో అనే కథనాన్ని ప్రచురితం చేసింది. ఈ సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలోని కోర్టు రోడ్డుకు రూ 3 కోట్ల 20 లక్షల తో నిర్మించనున్న కోర్టు బీటీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి శంకు స్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణం లో ఎన్నడూ జరగని విధంగా అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని, గత సంవత్సర కాలంలోనే రూ 250 కోట్లతో సిసి రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, పార్కులు, విద్యుత్ దీపాలు ఇతర మౌలిక స దుపాయాలు కల్పించడం జరిగిందని, ఇప్పటికే 80% వరకు పనులు పూర్తి అయ్యా యని తెలిపారు. త్వరలో మరిన్ని నిధులు తెచ్చి మహబూబ్ నగర్ కార్పోరేషన్ లో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి మహబూబ్ నగర్ కార్పోరేషన్ మీద ప్రత్యేక అభిమానం ఉందని, మున్సిపాలిటీ గా ఉన్న మహబూబ్ నగర్ ను మున్సిపల్ కార్పొరేషన్ గా అభివృద్ధి చేయడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. ముఖ్యమంత్రి గారు విజన్ 2047 ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారని, అదే స్పూర్తి తీసుకుని మహబూబ్ నగర్ విజన్ 2047 ద్వారా మహ బూబ్ నగర్ ను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని, మహబూబ్‌నగర్ లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు.

మహబూబ్ నగర్ అభివృద్ధికి అత్యధిక సంఖ్యలో నిధులు తెచ్చి రానున్న మూడు , నాలుగు సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేని విధంగా మహబూబ్ నగర్ మరింత అభివృద్ధి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాద వ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్, ఎన్ పి వెంకటేష్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, బుద్దారం సుధాకర్ రెడ్డి, సిజె బెనహార్, నాగరాజు, అజ్మత్ అలి, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు, సుదర్శన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు అనంత రెడ్డి, శ్రీధర్ రావు, కుర్మయ్య  పాల్గొన్నారు.