01-07-2025 12:18:05 AM
బీఆర్‌ఎస్ ఇంచార్జీ బాసు హనుమంతు నాయుడుని కలిసిన పోగాకు రైతులు
గద్వాల, జూన్ 30 ( విజయక్రాంతి ) : గద్వాల: పోగాకు రైతులు సాగు చేసిన పోగాకును వెంటనే కొనుగోలు చేయాలని పోగాకు కంపెనీల నిర్వాహకులను బీఆర్‌ఎస్ ఇంచార్జీ నాయకులు బాసు హన్మంతు నాయుడు కోరారు.
సోమవారం గట్టు మండలం మిట్టదొడ్డి, తుమ్మ లపల్లి, ముచ్చోనిపల్లి, చాగదోణ గ్రామాలకు చెందిన రైతులు తమ పొగాకు బేళ్లును కంపెనీ యాజమాన్యం కొనుగోలు చేయక వర్షాలకు మురిగిపోయే అవకాశం ఉందని కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని బాసు హనుమంతు నాయుడు ని కోరారు. సానుకూలంగా స్పందించిన ఆయన కంపెనీ యాజమాన్యంతో ఫోన్ ద్వారా మా ట్లాడి, పోగాకు బేళ్లను కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు. అందుకు కంపెనీ వారు స్పందిస్తూ మొత్తం పొగాకు బేళ్లును వారంలోపు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు.