calender_icon.png 20 November, 2025 | 2:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్‌కు బిగ్ షాక్.. విచారణకు గవర్నర్ అనుమతి

20-11-2025 01:10:13 PM

హైదరాబాద్: ఫార్ములా ఈ-కార్ రేసింగ్(Formula E-Car Racing) కేసులో మాజీ మంత్రి కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao)ను విచారించడానికి తెలంగాణ గవర్నర్(Telangana Governor ) జిష్ణు దేవ్ శర్మ అవినీతి నిరోధక శాఖ (Anti-Corruption Department)కి అనుమతి మంజూరు చేశారు. ఫార్ములా ఈ రేసింగ్ ఈవెంట్ కోసం కేటాయించిన నిధులలో రూ.54.88 కోట్ల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలతో ఈ కేసు విచారణకు వచ్చింది. ఈ దర్యాప్తుకు సంబంధించి కేటీఆర్ ఇప్పటికే నాలుగు సార్లు ఏసీబీ ముందు హాజరయ్యారు.

అంతకుముందు కేటీఆర్ ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయని పేర్కొంటూ, ప్రాసిక్యూషన్‌కు అనుమతి కోరుతూ ఏసీబీ గవర్నర్‌కు లేఖ రాసింది. ఈ అభ్యర్థనను అనుసరించి, గవర్నర్ ఇప్పుడు విచారణకు అనుమతి ఇస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో ఏసీబీ త్వరలో ఛార్జిషీట్ దాఖలు చేయనుంది. ఈ కేసులో ఏ-1గా కేటీఆర్, ఏ-2గా ఐఏఎస్ అరవింద్ కుమార్ ఉన్నారు. ఇప్పటికే అరవింద్ కుమార్ పై డీఓపీటీకి ప్రభుత్వం లేఖ రాసింది. కేంద్రం అనుమతి ఇస్తే అరవింద్ పై అభియోగాలు నమోదు కానున్నారు.