24-11-2025 01:43:10 PM
ఘట్ కేసర్,(విజయక్రాంతి): ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ స్కిడ్ అయ్యి ఇద్దరు యువకులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నేపాల్ కు చెందిన కమల్ (20) దామర్ (16) ఘట్ కేసర్ ఈడబ్ల్యూఎస్ కాలనీలో నివాసం ఉంటున్నారు. స్కూటీపై భోగారం వెళ్లి తిరిగి వస్తుండగా కొండాపూర్ సమీపంలో స్కూటీ స్కిడ్ అయి కింద పడడంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు.
సమాచారం అందుకున్న ఘట్ కేసర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.