29 May, 2026 | 3:04 AM

ధాన్యం సకాలంలో మిల్లులకు తరలించాలి

29-05-2026 02:11 AM

మాచారెడ్డి మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను, రైస్ మిల్లులను తనిఖీ చేసిన కలెక్టర్

కామారెడ్డి, మే 28 (విజయక్రాంతి): ధాన్యం సకాలంలో మిల్లులకు తరలించేలా అధికారులు సమన్వయముతో పని చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ అన్నారు. గురువారం మార్చారెడ్డి మండలం దాచపేటలో మహాబాల రైస్ మిల్, లక్ష్మీ రావులపల్లి లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు.

వరి ధాన్యం కొనుగోలు, అన్లోడింగ్ ప్రక్రియ, రవాణా ఏర్పాట్లను సమీక్షించారు. బక్రీద్ పండుగ సందర్భంగా డ్రైవర్ల కొరత లేకుండా రవాణా కు అంతరాయం కలగకుండా ఉండేందుకు కలెక్టర్ రవాణా శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి నిరంతరంగా రవాణా సేవలు కొనసాగించాలని ఆదేశించారు. వరి ధాన్యాన్ని రవాణా చేసే డ్రైవర్ల సేవలను అభినందిస్తూ మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చిన డ్రైవర్లకు కలెక్టర్ దుస్తులు, నగదు, ప్రోత్సాహకాలను అందజేశారు.

జిల్లా యంత్రాంగం చేపట్టిన కార్యక్రమాన్ని రవణదారులు డ్రైవర్లు అభినందిస్తూ కాలంలో తరలింపు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, రవాణా శాఖ అధికారులు, డ్రైవర్లు, మిల్లు ప్రతినిధు లు తదితరులు పాల్గొన్నారు. మాచారెడ్డి మండలంలోని లచ్చపేట మహాబాల రైస్ మిల్ లక్ష్మీరావులపల్లి ఐకేపీ వరి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, అదనపు కలెక్టర్ విక్టర్ కలిసి గురువారం సందర్శించి పరిశీలించారు. 

బక్రీద్ పండుగ సందర్భంగా డ్రైవర్ల కొరత లేకుండా రవాణా కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు జిల్లా కలెక్టర్ ఇటీవల రవాణాదారులతో సమావేశం నిర్వహించి, నిరంతర రవాణా సేవలు కొనసాగించాలని ఆదేశించారు. వరి రవాణాలో పాల్గొంటున్న డ్రైవర్ల సేవలను అభినందిస్తూ, ముఖ్యంగా మహారాష్ట్ర , కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చిన డ్రైవర్లకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ దుస్తులు, నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. జిల్లా అధికారులు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని రవాణాదారులు, డ్రైవర్లు అభినందిస్తూ, వరి ధాన్యం సకాలంలో తరలింపునకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. సంబంధిత శాఖల అధికారులు, రవాణాదారులు, డ్రైవర్లు, మిల్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.