సబితా ఇంద్రారెడ్డికి చిత్త శుద్ధి ఉంటే.. అవకతవకలపై విచారణ కోరాలి
కాంగ్రెస్ నేత బోయపల్లి రాఘవేందర్ రెడ్డి
బడంగ్ పేట్,మే 28(విజయక్రాంతి) మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డికి నిజంగా చిత్త శుద్ధి ఉంటే బడంగ్ పేట్ సర్కిల్ పరిధిలో గల అన్ని చెరువుల సుందరీకరణ పనుల అవకతవకలపై సమగ్ర విచారణ జరించాలని ఏఐసిసి విచార్ విభాగ్ కో ఆర్డినేటర్ బోయపల్లి రాఘవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం బడంగ్ పేట్ సర్కిల్ అల్మాస్ గూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ నాయకులు దిండు శ్రీనివాస్ గౌడ్, బోయపల్లి వెంకట్ రెడ్డి, ఎదుళ్ల ప్రతాప్ రెడ్డి, రామిడి శ్రీనివాస్ రెడ్డి సత్యనారాయణ తదితరులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో రాఘవేందర్ రెడ్డి, నవారు మల్లారెడ్డి మాట్లాడుతూ..
బిఆర్‌ఎస్ నాయకు దాదాపు రెండున్నర ఏళ్ల తరువాత వచ్చి మా కృషి తోనే పోచమ్మ కుంట అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కేఎల్‌ఆర్ కృషితో నిలిచిపోయిన నిధులు తిరిగి మంజూరు చేయించింది మేమన్నారు. బిఆర్‌ఎస్ నాయకులు కేవలం జిహెచ్‌ఎంసి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి డ్రామాలు ఆడుతున్నట్లు ఆరోపించారు.
ఇలాంటి జిమ్మిక్కులు బిఆర్‌ఎస్ నాయకులకు కొత్త కాదని, ఎన్నికలు సమీపించగానే చెల్లని జీవోలు, శిలాఫలకాలు వేసి ప్రజలను మధ్య పెట్టడం సర్వసాధారణమని విమర్శించారు. చెరువుల అభివృద్ధి జరిగితే మా కృషితోనే జరుగుతుందని చెప్పుకోవడం, జరగకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేయడం లేదని బిఆర్‌ఎస్ నాయకులు అనడం వారి ద్వంద వైఖరి ప్రజలందరికి తెలుస్తుందన్నారు. చెరువుల కాంట్రాక్టు పనులు చేసింది ఎమ్మెల్యే అనుచరులు అన్ని అన్నారు.
ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి నిజంగా చిత్త శుద్ధి ఉంటే బడంగ్ పేట్ సర్కిల్ పరిధిలో గల అన్ని చెరువులపై అభివృద్ధి పనులపై విచారణ కోరాలని రాఘవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే అభివృద్ధి చేస్తుంటే మేము కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, కాంగ్రెస్ పార్టీ ఏమి చేయడం లేదని మా ప్రభుత్వంపై విమర్శలు చేస్తే, చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదన్నారు.






