4 June, 2026 | 2:18 AM

90 శాతం ధాన్యం కొనుగోలు పూర్తి

04-06-2026 01:45 AM

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

గంగాధర, జూన్ 3 (విజయక్రాంతి): రైతుల సహకారంతో చొప్పదండి నియోజకవర్గం లో 90 శాతం ధాన్యం కొనుగోలు చేసినట్లు, మరో మూడు నాలుగు రోజుల్లో మిగిలిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. బుధవారం గంగాధర మండలం నాగిరెడ్డి పూర్ లో ఏర్పాటు చేసిన ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు పై ప్రతిపక్షాలు ఎన్నో ఆరోపణలు చేశాయని, ధాన్యం కొనుగోలు చేయడం లేదని, లారీలు రావడంలేదని బురదజల్లే ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా, మొసలి కన్నీరు కార్చినా రైతులు వారిని నమ్మలేదని అన్నారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కొనుగోలు కేంద్రాలపై నిత్యం పర్యవేక్షణ చేస్తూ కొనుగోళ్లు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

అన్ని సమస్యలను అధిగమించి జూన్ మొదటి వారంలోనే ధాన్యం కొనుగోలను పూర్తి చేయనున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో ధాన్యం సేకరణ పది రోజులు ఆలస్యమైనా రైతుల సహకారంతో సకాలంలో పూర్తి చేసినట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన మూడు నాలుగు రోజుల్లోనే ధాన్యం డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాము, స్థానిక సర్పంచ్ గునుకొండ బాబు, ఆకుల ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.