09-05-2025 12:00:00 AM
సీపీఎం రాష్ర్ట కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు
భద్రాద్రి కొత్తగూడెం / ఖమ్మం, మే 8 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు అకాల వర్షాలు, అధికారులు నిర్లిప్తత మూలంగా తీవ్ర అగచాట్లు పడుతున్నారని, తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సిపిఎం రాష్ర్ట కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఖమ్మం సుందరయ్య భవన్‌లో కళ్యాణం వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సమా వేశంలో సుదర్శన్‌రావు మాట్లాడుతూ ఎం తో వ్యయ ప్రయాసలకోర్చి అన్నదాతలు పండిరచిన పంటను రాష్ర్ట ప్రభుత్వం కొనుగోలు చేయకుండా తీవ్ర జాప్యం చేస్తుందని విమర్శించారు.
రైతులు ఎప్పుడెప్పుడు తమ ధాన్యాన్ని కొనుగోలు చేస్తారో అని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారని, మరోవైపు అకాల వర్షాల పడుతుండటంతో ధాన్యాన్ని కాపాడుకోలేక అరిగోస పడుతున్నారు. ఇదే అదనుగా ధాన్యాన్ని తక్కువ రేటుకు కొంటూ రైతులను దళారులు దగా చేస్తున్నారన్నారు. కొనుగోలు కేంద్రాల్లో తగినన్ని గన్నీ బ్యాగులు లేక సమయానికి లారీలు రాక కాంటాలు జరగకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు.
ధాన్యం కొనుగోలు మిల్లర్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి జరుగుతోందని, మిల్లర్లు, ప్రభుత్వం మధ్య ఉన్న సమస్యలలో ధాన్యం రైతులను బలి చేస్తున్నారని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఆరబోసిన ధాన్యం కాంటాలు వేయడం కోసం గన్ని సంచులు సరఫరా చేయకపోవడం, కాంటాలు వేసిన ధాన్యం బస్తాలు తరలింపు చేయకపోవడంతో వర్షాలకి తడిసి రైతులు తీవ్ర అగచాట్లు పడుతున్నారని, గాలి దుమా రం, వడగండ్ల వానతో మధ్యాహ్నం ధాన్యం ఆరబోయడం,
సాయంత్రం పోగు వేయడం జరుగుతుందని, వాతావరణ మార్పులు గమనంలోకి తీసుకుని ధాన్యం కొనుగోలు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మా చర్ల భారతి, బొంతు రాంబాబు, వై. విక్రమ్, భూక్యా వీరభద్రం, మాదినేని రమేష్, ఎర్రా శ్రీనివాసరావులు పాల్గొన్నారు.