calender_icon.png 9 May, 2025 | 6:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్యాంకు లింకేజీలో నాలుగోసారి అవార్డు

09-05-2025 12:00:00 AM

మంచిర్యాల, మే 8 (విజయక్రాంతి): బ్యాంకు లింకేజీలో మంచిర్యాల జిల్లా నాలుగోసారి ఉత్తమ అవార్డు అందుకుంది. బ్యాం కు లింకేజ్‌లో 2024 ఆర్థిక సంవత్సరానికిగాను బ్యాంకు లింకేజీలో రూ.464 కోట్లు, 0.5 శాతం ఎన్పీఏతో ఓవరాల్ పెర్ఫార్మేన్స్ ప్రదర్శించారు. గురువారం మంత్రి సీతక్క, ప్రిన్సిపాల్ సెక్రటరీ లోకేష్ కుమార్, సీఈఓ దివ్య చేతులు మీదుగా అవార్డు అం దుకున్నారు.

అవార్డు అందుకున్న వారిలో మంచిర్యాల డిఆర్డిఓ కిషన్, అదనపు డి ఆర్ డి ఓ వెంకటేశ్వర్లు, డీపీఎం (బ్యాంకు లింకే జ్) స్వర్ణలత, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు అనితలు ఉన్నారు. ఈ సందర్భంగా డీఆర్డిఓ కిషన్ మాట్లాడుతూ జిల్లాకు వరుసగా నాలుగోసారి బ్యాంకు లింకేజీలో రాష్ట్రస్థాయి అవార్డు రావడం ఆనందంగా ఉందన్నారు.

కార్యక్రమంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చైర్మన్, నాబార్డ్ సిజిఎం, ఇతర రాష్ట స్థాయి బ్యాంకు అధికారులు, బ్యాంకు లింకేజీ డైరెక్టర్ వై ఎన్ రెడ్డి, బెల్లంపల్లి ఏపీఎం శ్యామల, సీసీ సత్య నారాయణ పాల్గొన్నారు.