calender_icon.png 9 May, 2025 | 3:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉరుములు, పిడుగులతో భారీ వర్షం

09-05-2025 12:00:00 AM

బూర్గంపాడు, మే 8 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లోని పలు ప్రాంతాల్లో గురువారం సాయం త్రం ఈదురు గాలులు, ఉరుములు, పిడుగులతో భారీ వర్షం కురిసింది. ఉద యం నుంచి ఎండ తీవ్రత అధికంగా ఉంది. సాయంత్రం నాలుగు గంటల సమయంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దట్టంగా మేఘాలు కమ్ముకుని ఒక గంట పాటు ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది.

సారపాక,తాళ్ళ గొమ్మూరు, ఇరవెండి గ్రామాల్లో కొబ్బరి,తాటి చెట్లపై పిడుగు పడడంతో మంటలు చెలరేగాయి. దీంతో ఆ పరిసర ప్రాంతంలోని జనం భయాందోళన చెందారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ కాయగా,ఆ తరువాత వర్షం కురవడంతో జనం కాస్త ఉపశమనం పొందారు.

ఈదురుగాలులు, భారీ వర్షం.. నేలకూలిన వృక్షాలు.. కొన్నిచోట్ల పిడుగులు 

భద్రాచలం, మే 8 (విజయక్రాంతి) ః భద్రాచలం పట్టణంలో గురువారం సాయంత్రం భారీ ఈదురుగాలతో కురిసిన వర్షం వల్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ గాలులకు వివిధ కాలనీలో ఉన్న చెట్లు విద్యుత్ తీగలపై విరిగిపడటం, అదే స్థాయిలో వర్షం కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

అంతేకాకుండా భద్రాచలం పట్టణంలోని ఉరుములు మెరుపులతో వర్షం కొడవటంతో బయటకు రావడానికి ప్రజలు తీవ్ర భయాందోళన చెందారు. భగవాన్ దాస్ కాలనీలోనే రాజరాజేశ్వరి దేవాలయం సమీపంలో కొబ్బరి చెట్టుపై పిడుగు పడి చెట్టు మొత్తం దగ్ధమైంది.

ఇటీవల కాలంలో ఇంత బారీస్థాయిలో గాలులతో కూడిన వర్షం పడటం ఇదే మొదటిసారి. రోడ్లపై పడిన చెట్లను గ్రామపంచాయతీ ఆర్ అండ్ బి అధికారులు కృషి చేస్తుండగా, విద్యుత్ లైన్ పై పడిన వృక్షాలను విద్యుత్ శాఖ తొలగిస్తూ కరెంటు పునరుద్ధరణకు కృషి చేస్తున్నది.