calender_icon.png 5 November, 2025 | 1:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్దపల్లిలో గింజ కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోళ్లు

04-11-2025 12:00:00 AM

-48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ..

- పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం..

-వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవంలో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు

కాల్వశ్రీరాంపూర్, నవంబర్ 03(విజయ క్రాంతి) కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్, కూనారం గ్రామాల్లో ఐకేపీ, సింగిల్ విండో ఆధ్వర్యంలో సోమవారం వరి ధాన్యం కొనుగో లు కేంద్రాలను స్థానిక నాయకులు, అధికారులతో కలిసి సోమవారం పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు ప్రారంభించారు.అనంతరం కాల్వశ్రీరాంపూర్ మం డలంలోని పలు గ్రామాలకు చెందిన 51 మంది లబ్ధిదారులకు రూ. 59,00,000/- లక్షల గల కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చె క్కులను పంపిణి ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ... రైతులు దళారీల చేతుల్లో మోసపోకుండా సింగిల్ విండో, ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా వరి ధాన్యం కొనుగోలు చే యడం జరుగుతుందని, మొక్కజొన్నలు, పత్తి ,వరి, మిర్చి, పొద్దు తిరుగుడు రైతులు ఏ పంట పెట్టిన ఆ పంటకు ప్రభుత్వం మ ద్దతు ఇచ్చి రైతులను పంట నష్టపోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతుంది అన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు, బిఆర్‌ఎస్ నా యకులు ఎన్ని తప్పుడు ఆరోపణలు చేసిన ఈ తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మా ర్కెట్ చైర్మన్, సింగిల్ విండో చైర్మన్లు, మండల పార్టీ అధ్యక్షులు, మహిళలు, కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు, నా యకులు, కార్యకర్తలు, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.మండల స్థాయి రైతు సదస్సు లో పాల్గొన్న ఎమ్మెల్యే విజయరమణ రావు

కాల్వ శ్రీరాంపూర్ మండలం, కూనారం గ్రామంలో రైతువేదిక ప్రాంగణంలో సోమవారం కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయ కృషి విజ్ఞాన కేంద్రం రామగిరిఖిల్లా పెద్దపల్లి జిల్లా వారి ఆధ్వర్యంలో కాల్వ శ్రీరాంపూర్ మండల స్థాయి రైతు సదస్సుకు ముఖ్యఅతిధిగా ఎమ్మెల్యే విజయర మణ రావు పాల్గొన్నారు.ముందుగా కూనారం గ్రామంలో కోర మండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్.వో వాటర్ ఫ్లాంట్ ను కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సిలర్ డా.దండ రాజిరె డ్డి, కోరమాండల్ ప్రతినిధులతో కలిసి ఎమ్మె ల్యే ప్రారంభించారు.

ముందుగా ఉద్యాన విశ్వవిద్యాలయ కృషి విజ్ఞన కేంద్రం వారి రై తు సదస్సు లో ఏర్పాటు చేసిన పలు స్టాళ్ల ను రాజి రెడ్డి, సుబ్బా రెడ్డి, భాస్కర్ రెడ్డి లతో కలిసి ప్రారంభించిన తదుపరి పలు స్టాళ్లల్లో ప్రదర్శించిన వరి ధాన్యం, పిండివంటలు, పంట పిచికారీ మందులను పరిశీలించిన ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కోరమాండల్ వైస్ ప్రెసిడెంట్ జి.వి. సుబ్బారెడ్డి, కోరమాండల్ సీనియర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పి. భాస్కర్ రెడ్డి, మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్, మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు గజవేన సదయ్య, మాజీ ప్రజాప్రతి నిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.