calender_icon.png 5 November, 2025 | 9:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించే వరకు కళాశాలల బంద్

04-11-2025 12:00:00 AM

-డిగ్రీ కళాశాల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాద రామకృష్ణ

జగిత్యాల అర్బన్, నవంబర్ 3 (విజయ క్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం తమకు రావలసిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించే వ రకు డిగ్రీ కళాశాలల నిరవధిక బందు పాటిస్తామని డిగ్రీ కళాశాల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాద రామకృష్ణ తెలిపారు.

సో మవారం జగిత్యాలలో ప్రైవేట్ డిగ్రీ కళాశాలల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వి లేకరుల సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగు సంవ త్సరాలుగా ఇవ్వవలసిన ఫీజు రియంబర్స్మెం ట్ బకాయిలు ప్రస్తుత సంవత్సరంతో కలిసి పదివేల కోట్లకు చేరిన సందర్భంలో గత రెండు సంవత్సరాలుగా ప్రస్తుత ప్రభుత్వానికి ఎన్నిసార్లు మనవి చేసిన కనీస స్పందన లేని కారణంగా రాష్ట్రంలోని అన్ని ఉన్నత విద్యాసంస్థలు తప్పని పరిస్థితిలో నిరవధిక బందుకు వెళ్లినట్లు తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి ప్రణాళిక, ముందు చూపులేని తనం వల్ల ఈరోజు స్కాలర్షిప్ బకాయిలు 10,000 కోట్లకు చేరుకున్నాయన్నారు.

ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించిన పోవడంతో కళాశాలల నిర్వహణ భారంగా మారడంతో పే ద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నార న్నారు. ప్రభుత్వం గతంలో ఇచ్చి న 1200 కోట్ల టోకెన్లు వెంటనే క్లియర్ చే యాలని, మిగతా బకాయిలకు ఒక స్పష్టమై న ప్రణాళికతో ముందుకు వస్తే తాము కూ డా ప్రభుత్వా నికి సహకరిస్తామని,అంతవరకు బందు విరమించలేమని తెలిపారు.

శాతవాహన యూని వర్సిటీ ప్రైవేటు కళాశాలల యాజమాన్య సం ఘం ప్రధాన కార్యదర్శి శ్రీపాద నరేష్ మాట్లాడుతూ తామంత చదువుకున్న నిరుద్యోగు లమని స్వయం ఉ పాధి పథకంలో భాగంగా కళాశాలలు నెలకొల్పి తాము ఉపాధి పొందు తూ తమతో పాటు పదిమందికి ఉద్యోగ అవకాశాలు క ల్పిస్తున్నామన్నారు. ఏవో కొన్ని కార్పోరేట్ కళాశాలలు, కొంతమంది రాజకీ య నాయకుల కళాశాలలను దృష్టిలో పెట్టుకుని అందరూ అదే బాటలో ఉన్నారని ప్రభు త్వం తమలాంటి నిరుద్యోగుల ఉపాధి అవకాశాలను దెబ్బతీయ వద్దని కోరారు. నిజాయితీ గా పని చేస్తున్న తమలాంటి వాళ్ళ జీవితాలను కాపాడాలని, వెంటనే రియంబర్స్మెంట్ నిధు లు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరా రు.

డిగ్రీ విద్యను అందించే వి ద్యాశాఖను కూడా చూస్తున్న ముఖ్యమంత్రి చిన్న చూపు చూడడం చాలా బాధాకరమన్నారు. తమకు రావలసిన డబ్బులు అడిగితే విజిలెన్స్ దాడులతో భయభ్రాంతులకు గురిచేస్తూ సమాజంలో తమపై చెడు అభిప్రాయం వచ్చే రకంగా ప్రవర్తించడం సరైనది కాదని తెలిపారు. జగిత్యాల జిల్లాకు సంబంధించిన సుమారు 50 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని, ఇప్పటి కే గత 3 సంవత్సరాలనుండి సుమారు 10 కళాశాల లు ఆర్ధిక ఇబ్బందులతో మూతబడి కేవలం 11 కళాశాలలు మాత్రమే మిగి లాయని వాటిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు.

ధర్మపురి నవోదయ కళాశాల కరస్పాండెంట్ ఆంజనేయులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత కళాశాలలో రియంబర్స్మెంట్ నిధు లు లేక మూతపడితే అక్కడ యువత చెడు మార్గాల వైపు వెళ్తున్నారని వాళ్లు ఉపాధి కోసం కూలీ పనులకు లేదా దుబాయ్ లాంటి దేశాలకు వలస వెళ్తున్నారని అలాం టి ప్రమాదం నుంచి యువతను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని తెలిపా రు. ఈ సమావేశంలో ధర్మపురి కళాశా ల కరస్పాండెంట్ మూర్తి ఇతర యాజమాన్య సభ్యులు పాల్గొన్నారు.