10-05-2025 01:31:53 AM
జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు
సూర్యాపేట, మే 9 (విజయక్రాంతి) : ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు చేసిన ధాన్యంను త్వరగా మిల్లులకు తరలించాలని జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు పేర్కొన్నారు.
శుక్రవారం సూర్యాపేట మండలంలోని రాయినిగూడెం 2, టేకుమట్ల 2 మెప్మా ఆధ్వ ర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఆయన పరిశీలించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు రాయినిగూడెం 2 నుండి 4743.20 క్వింటాల ధాన్యం, టేకుమట్ల 2 కొనుగోలు కేంద్రం నుండి 6948.8 క్వింటాలు ధాన్యం తరలించడం జరిగిందన్నారు.
రైతులు తాలు లేకుండా శుభ్రమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకి తీసుకోనిరావాలని తేమ శాతం 17రాగానే సీరియల్ ప్రకారం కాంట వేసి మిల్లులకు తరలించాలని నిర్వా హకులకు సూచించారు. ఈయన వెంట కేంద్ర ఇన్చార్జిలు గౌతమి, ఫణిమా, సరిత పాల్గొన్నారు.