12-05-2025 08:48:53 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో మంగళవారం పాలిసెట్ ప్రవేశపరీక్షలు నిర్వహిస్తున్నట్టు పాలిసెట్ కన్వీనర్ రమేష్ తెలిపారు. జిల్లా కేంద్రంలో మొత్తం 8 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు పరీక్ష ఉంటుందని, అభ్యర్థులు గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, ఎలక్ట్రానిక్ వస్తువులు నిషేధమన్నారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో పరీక్ష కేంద్రం వద్ద బందోబస్తు ఉంటుందని దాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఎస్పీ వెల్లడించారు.