calender_icon.png 13 May, 2025 | 2:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరి ప్రదక్షిణలో మాజీ ఎమ్మెల్యే

12-05-2025 08:10:07 PM

లక్షెట్టిపేట,(విజయక్రాంతి): మున్సిపాలిటీ పరిధి లోని మోదెల రోడ్ లో శంఖ చక్రములు, పట్టే నామాలతో స్వయంభువుగా వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గుట్ట వద్ద నిర్వహించిన గిరి ప్రదక్షిణ మహోత్సవంలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు సోమవారం హాజరై స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్, మాజీ డిసిఎంఎస్ చైర్మన్ కేతిరెడ్డి  శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొత్త వెంకటేశ్వర్లు, ఆవోపా అధ్యక్షులు కొత్త కిరణ్ కుమార్, చింతల శ్రీనివాస్, జగన్మోహన్ రెడ్డి, ఆలయ అడక్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.