calender_icon.png 13 May, 2025 | 12:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధిత కుటుంబాలకు పుట్ట మధూకర్ పరామర్శ

12-05-2025 08:02:33 PM

కాటారం,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని పలు గ్రామాలలో వివిధ కారణాలతో చనిపోయిన వ్యక్తుల కుటుంబాలను మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పరామర్శించారు. కాటారం మండలం గారెపల్లి గ్రామంలో చీమల రమేష్ మరణించగా వారి పార్థీవ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించారు. కొత్తపల్లి గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న పెద్ది లక్మయ్య కూతురు మౌనికను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆదివారం పేట గ్రామంలో చిర్ల రాజిరెడ్డి ఇటీవల మరణించగా వారి కుటుంబాన్ని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ పరామర్శించారు.