10-05-2025 12:00:00 AM
వికారాబాద్, మే-09: వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ ఆకస్మికంగా పరిగి మండలంలోని పరిగి సుల్తాన్పూర్ గ్రామం లోని డిసిఎంఎస్ వరి కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు.
తనిఖీల్లో భాగంగా సెంటర్ కి వచ్చిన దాన్యమును వెంటనే రైతుల నుంచి కొనుగోలు చేసి టాకింగ్ చేసిన విధంగా రైస్ మిల్లులకు వరి ధాన్యం వెంటనే పంపవలసిందిగా సెంట్ ఇన్చార్జిలకు ఆదేశించారు. జిల్లాలో 128 వరి కొనుగోలు కేంద్రాలను ఏ ర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు 13,425 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేసి రైతులకు సుమారు గా రూపాయలు 12.88 కోట్లు చెల్లించినట్లు తెలిపారు.