15-05-2025 09:52:55 AM
చందేల్: మణిపూర్‌లోని చందేల్ జిల్లాలో అస్సాం రైఫిల్స్ యూనిట్‌తో జరిగిన కాల్పుల్లో కనీసం పది మంది ఉగ్రవాదులు మరణించారని భారత సైన్యం(Indian Army) తూర్పు కమాండ్ తెలిపింది. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని వెల్లడించింది. "ఇండో-మయన్మార్ సరిహద్దు సమీపంలోని చందేల్ జిల్లా ఖెంగ్‌జోయ్ తహసీల్, న్యూ సమతాల్ గ్రామం సమీపంలో సాయుధ క్యాడర్ల కదలికపై నిర్దిష్ట నిఘా సమాచారం ఆధారంగా, స్పియర్ కార్ప్స్ ఆధ్వర్యంలోని అస్సాం రైఫిల్స్ యూనిట్ 2025 మే 14న ఆపరేషన్ ప్రారంభించింది" అని ఆర్మీ తూర్పు కమాండ్ ఎక్స్ పోస్ట్‌లో తెలిపింది. అటు జమ్మూ కాశ్మీర్ రాజౌరి జిల్లా నౌషెరా ప్రాంతంలో బాంబులు నిర్వీర్యం చేశారు. ఆర్మీ ఇంజినీర్ బాంబు నిర్వీర్య బృందాలు బాంబులు నిర్వీర్యం చేశారు. నివాస ప్రాంతాల్లో గుర్తించిన బాంబులను కూడా నిర్వీర్యం చేసినట్లు అధికారులు తెలిపారు.