10-05-2025 12:00:00 AM
- ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు
ఎల్బీనగర్, మే 9 : పహాల్గంలో ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ శత్రుమూకలపై విరుచుకుపడుతుంది. పాక్ సరిహద్దుల్లో భారత జవాన్లకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుతూ ఎల్బీనగర్ నియోజకవర్గంలో వివిధ ఆలయాల్లో ప్రజా ప్రతినిధులు, నాయకులు, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నాగోల్ డివిజన్ కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్ ఆధ్వర్యంలో నాగోల్ రామాలయంలో స్థానికులు ప్రత్యే క పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకుడు సామ రంగారెడ్డి మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలో ప్రతి శత్రువుకి ధీటైన సమాధానం దొరుకుతుందన్నారు. పాకిస్తాన్ మీద ప్రతీకారం తీర్చుకున్నందుకు ప్రతి భారతీయుడు గర్వపడుతున్నాడని తెలిపారు. భారత సైనికులకు మరింత శక్తిని ప్రసాదించా లని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
- కర్మన్ ఘాట్ ఆలయంలో ప్రత్యేక పూజలు
ఆపరేషన్ సింధూర్ లో భాగంగా తీవ్రవాదాన్ని అంతం చేయడమే లక్ష్యంగా ధైర్యంగా సాహసో పేతంగా పోరాడుతున్న భారత సైన్యానికి మద్ధతుగా, వారి క్షేమం విజయం కోరుతూ కర్మన్ ఘాట్ హనుమాన్ దేవస్థానంలో వేద పండితులు, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు, సిబ్బంది అందరు భారత జాతీయ పతాకానికి వందనం చేసి, జై హింద్.. జై శ్రీరామ్.. జై జవాన్ అంటూ నినదించారు.