13-11-2025 12:51:30 AM
తహసీల్దార్ శ్రీనివాస్
వెల్దుర్తి, నవంబర్ 12 :రైతులు తెచ్చిన ధాన్యాన్ని జాప్యం లేకుండా కొనుగోలు చేయాలని వెల్దుర్తి తహసిల్దార్ శ్రీనివాస్ సూచించారు. బుదవారం వెల్దుర్తిలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ధాన్యాన్ని 17 శాతం తేమ వచ్చే విధంగా ఆరబెట్టుకొని, తాలు లేకుండా మిషన్లో తూర్పార పట్టాలన్నారు. క్వింటాలుకు ఏ-గ్రేడ్ రూ.2389లు, బి-గ్రేడ్ రూ.2369 మద్దతు ధర పొందాలన్నారు.
రైతులు తెచ్చిన ధాన్యాన్ని వెంటనే ట్యాబ్ ఎంట్రీ చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల ధాన్యాన్ని మిల్లులకు పంపినట్లయితే, యాజమాన్యం కొరివి పెట్టకుండా చూడాలని కోరారు. రైతులను ఇబ్బందుల గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ నర్సింగ్ యాదవ్, వెంకటరమణ, రైతులు పాల్గొన్నారు.