calender_icon.png 13 November, 2025 | 2:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధిత కుటుంబాలకు అండగా ఉంటా !

13-11-2025 12:49:18 AM

టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి

కొండాపూర్, నవంబర్ 12: కొండాపూర్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో జరిగిన అనారోగ్య, ప్రమాదాలు, మరణాల నేపథ్యంలో బాధిత కుటుంబాలను టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి బుధవారం పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేసి వారికి ధైర్యం చెప్పి భరోసా కల్పించారు. మండలంలోని గంగారం గ్రామానికి చెందిన వెంకటమ్మ అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఇంటి వద్ద పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు.

అలాగే ఇటీవలే మరణించిన సుదర్శన్ కుటుంబాన్ని చైర్మన్ పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను గుర్తించి సహాయం అందజేశారు. సైదాపూర్ గ్రామానికి చెందిన జర్నలిస్టు ప్రవీణ్ ఇటీవల జరిగిన ప్రమాదంలో చేయి విరగడంతో ప్రస్తుతం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయనను పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఇటీవలే మరణించిన మంగళారం విక్రమ్ కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతసాగర్ గ్రామానికి చెందిన రేషన్ డీలర్ వినోద్ సతీమణి మరణంతో కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. ఎవరికైనా అనారోగ్యం వచ్చినా, ప్రమాదం జరిగినా లేదా కుటుంబంలో మరణం సంభవించినా వారు ఒంటరిగా ఉన్నారని భావించవద్దని, వారికి అండగా ఉండి అవసరమైన ఆర్థిక సాయం, ప్రోత్సాహం అందజేస్తామని నిర్మల జగ్గారెడ్డి భరోసా కల్పించారు. ప్రజల కష్టాల్లో, బాధల్లో సహాయం చేయడం నా బాధ్యతగా భావిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.