03-05-2025 12:00:00 AM
సన్న రకం వడ్లకు మద్దతు ధరతోపాటు రూ.500 బోనస్
కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల, మే 2 (విజయక్రాంతి) : రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద నుండి నాణ్యమైన వరి ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని, ఈ క్రమంలో రైస్ మిల్లులకు కేటాయించిన వరిధాన్యం లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.
శుక్రవారం మందమర్రి మండల కేంద్రంలోని అంబికా సాయి, వాసవి, లక్ష్మీగణపతి, వెంకటేశ్వర్ రైస్ మిల్లులను మండల తహసీల్దార్ సతీష్‌తో కలిసి సందర్శించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద నుండి నిబంధనల ప్రకారం నాణ్యమైన వరి ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు.
సన్న రకం వడ్లకు మద్ద తు ధరతో పాటు 500 రూపాయల అదన పు బోనస్ అందించడం జరుగుతుందని తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా త్రాగునీరు, నీడ, ఓఆర్‌ఎస్ సౌకర్యాలు కల్పించడంతోపాటు అవసరమైన గోనె సం చులు, టార్పాలిన్లను సమకూర్చడం జరుగుతుందని తెలిపారు.
అవసరం మేరకు హమా లీ సంఖ్యను పెంపొందించుకొనాలని సూచించారు. అనంతరం మండల కేం ద్రంలో లబ్దిదారులకు మంజూరైన రెండు పడక గదుల ఇండ్లను పరిశీలించారు. ఇండ్లలో మిగిలి ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని, లబ్దిదారులు తమకు కేటాయించిన ఇంటిలో తప్పనిసరిగా ఉండాలని, ఆ దిశగా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు.
మండల కేంద్రంలోని మండల పరి షత్ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని సం దర్శించి ఉద్యోగుల హాజరు పట్టికను పరిశీలించారు. అధికారులు, సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటించాలని, ప్రజలతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. ఎల్.ఆర్.ఎస్. ప్రక్రియను వేగవం తం చేసి అర్హులైన లబ్దిదారుల నుండి రుసుమును త్వరగా వసూలు చేయాలని తెలిపా రు.
మండల పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసి జాబితా రూపొందించాలని, రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను త్వరగా పూర్తిచేసి వివరాలతో నివేదిక తయా రు చేసి అందించాలని తెలిపారు.
అనంతరం మండలంలోని పులిమడుగు గ్రామంలో నిర్వహిస్తున్న నర్సరీని సందర్శించి మొక్కల సంరక్షణ చర్యలను పరి శీలించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాజేశ్వరి, సంబంధి త అధికారులు, రైస్ మిల్లుల యజమాను లు, తదితరులు పాల్గొన్నారు.