03-05-2025 12:00:00 AM
భీష్మ రాజ్ ఫౌండేషన్ సభ్యులు,గడ్డం తిప్పన్న
నారాయణపేట. మే 2(విజయక్రాంతి): భీష్మరాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం నారాయణపేటలోని ఎస్.ఆర్.గార్డెన్స్ లో నిర్వహించ తలపెట్టిన మెగా జాబ్ మేళాకు చదువుకొని ఖాళీగా ఉన్న నిరుద్యోగ యువతీ యువకులు అధిక సంఖ్యలో హాజరై ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని భీష్మరాజ్ ఫౌండేషన్ సభ్యులు గడ్డం తిప్పన్న సూచించారు. శుక్రవారం నారాయణపేట ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులతో కలిసి తిప్పన్న మాట్లాడారు. భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కే.రాజ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో నేడు మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని తెలిపారు. మెగా జాబ్ మేళాలో 50 కంపెనీలు పాల్గొంటాయని వివరించారు.
ఈ సదావకాశాన్ని నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఫౌండేషన్ సభ్యులు పోలీసు పటేల్ మధుసూదన్ రెడ్డి, గోపాల్ గౌడ్, హన్మంతు ముదిరాజ్, నర్సింహనాయుడు, అశోక్, చామకూర నగేష్, ఉడ్మలగిద్ద అశోక్ తదితరులు ఉన్నారు.