03-05-2025 12:00:00 AM
నారాయణపేట, మే 2(విజయక్రాంతి): తెలంగాణపబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా నూతనంగా నియమితు లైన జిల్లాలోని షెడ్యూల్డు కులాల అభివృద్ధిశాఖ పరిధిలో గల ఎస్సి వసతిగృహల్లో ఖాలీగా ఉన్న ఆరు(6)వసతిగృహా లకు ఆరు మంది వసతి సంక్షేమఅధికారులనియామకం అయినట్లు జిల్లా షెడ్యూల్డు కులాల అభివృద్ది అధికారి కజ్జం ఉమాపతి ఒక ప్రకటనలో తెలిపారు.
నియామకం అయిన సంక్షేమ వసతి గృహ అధికారులు జిల్లా కలెక్టరు సిక్తా పట్నాయక్ ని మర్యాద పూర్వకంగా కలవడం జరిగిందని వారినుద్దేశించి కలెక్టరు విధులపట్ల అంకిత భావముతో సేవా తత్పరత, నిజాయితీ నిబద్ధత కలిగి ఉండి పేద విద్యార్థుల యొక్క అభ్యున్నతికి కృషి చేయాలనిజిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ వారికి సూచించారు.
జిల్లాలో మొత్తము-13 వసతి గృహాలకు గాను(6) వసతి గృహాలలో ఖాళీలు ఉండగా ప్రభుత్వం వాటిని భర్తీ చేసింది వాటిలో రాజేశ్వరి. ఎస్సి గరల్స్ హాస్టల్ కోస్గి, సునీత ఎస్సి గరల్స్,హాస్టల్ మాగనూరు .బాబుఎస్సి బాయ్స్ హాస్టల్ మక్తల్.సాయి రెడ్డి ఎస్సి బాయ్స్, హాస్టల్ ధన్వాడ .ఎండి ఆఫ్రోజ్ , ఎస్సి బాయ్స్ నారాయణపేటఎం రాజ శేఖర్ రెడ్డి, ఎస్సి ఆనంద నిలయం మక్తల్ లకు నియామకము చేయటం జరిగిందని ఆయన తెలిపారు.