20-12-2025 12:00:00 AM
ఖమ్మం, డిసెంబర్ 19 (విజయక్రాంతి): ఖమ్మం నగరంలోని శ్రీనగర్ కాలనీలో గల స్టెమ్‌స్పార్క్ రెజొనెన్స్ స్కూల్ విద్యార్థులు ఇటీవల బెంగుళూరులో నిర్వహించిన 11వ డబ్ల్యూఎఫ్‌ఎస్‌కేఓ నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్ 2025లో అద్భుత ప్రతిభ కనబర్చారు. అండర్ 14 విభాగంలో ఎస్‌కేఅద్నాన్ 4వ తరగతి విద్యార్థి 55కేజీల కటా విభాగంలో 3వ స్థానంలో, కుముతిలో ప్రథమ స్థానంలో బంగారు పతకాన్ని సాధించాడు.
ఎస్‌కే ఉబేద్ 4వ తరగతి విద్యార్థి యెల్లో బెల్టు కటా విభాగంలో మొదటి స్థా నంలో నిలిచి బంగారు పతకాన్ని, స్పోరింగ్‌లో మూడవ స్థానంలో నిలిచి కాంస్య పత కాన్ని సాధించాడు. స్టెమ్‌స్పార్స్ రెజొనెన్స్ శ్రీనగర్ విద్యార్థులు తమ కరాటే నైపుణ్యాలను ప్రదర్శించి తిరుగులేని శక్తిగా నిలిచి వారి అత్యుత్త మ ప్రదర్శనతో ఛాంపియన్షిప్ ట్రోఫిని కూడా కైవసం చేసుకొని ప్రముఖుల అభినందనలు పొందారు.
పాఠశాలలో జరిగిన అభినందన సభలో పాఠశాల డైరెక్టర్స్ కె.శ్రీధర్‌రావు, కృష్ణవేణి ఆ విద్యార్థులను అభినందిం చి ఆశీర్వదించారు.కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ పీవీఆర్ మురళీమోహన్, కోచ్ ఎస్‌కే ఖాసీమ్, ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది విజేతలను అభినందించారు.