11-12-2025 09:25:41 AM
జగదేవపూర్, (విజయక్రాంతి): ఎస్ఐ కృష్ణారెడ్డి జగదేవపూర్ మండల వ్యాప్తంగా భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ సిద్దిపేట పోలీస్ కమిషనర్, సిఐ మహేందర్ రెడ్డి ఆదేశానుసారం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఓటర్లు వారి అమూల్యమైన ఓటును ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా వినియోగించుకోవాలని సూచించారు. ఎవరైనా ప్రలోభలకు గురి చేసినట్లయితే డయల్ 100 కు కాల్ చేయాలని తెలిపారు.