11-12-2025 10:58:34 AM
హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల(Gram Panchayat elections) తొలి దశలో భాగంగా 3,834 సర్పంచ్ పదవులకు, 27,628 వార్డు సభ్యుల పదవులకు జిల్లాల్లో పోలింగ్ ప్రారంభమై కొనసాగుతోంది. మహిళలు, వృద్ధులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సూర్యాపేట జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ కు గుండెపోటు వచ్చింది. తక్షణమే పోలీసులు సీపీఆర్ చేసి ప్రాథమిక చికిత్స అందించారు. హెడ్ కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉండటంతో సూర్యాపేటకు తరలించారు. జిల్లాలోని నూతనకల్ మండలం మిర్యాల పోలింగ్ కేంద్ర వద్ద ఈ సంఘటన జరిగింది.