11-12-2025 09:21:52 AM
నవాబ్ పేట : మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నవాబ్ పేట మండలం లో కారుకొండ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,రుద్రారం గ్రామంలో ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల,నవాబ్ పేట్ మండలం,గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళినిజిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయేందిర బోయి పరిశీలించారు. ఎక్కడ ఇలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరిగేలా చూడాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు.