calender_icon.png 11 December, 2025 | 11:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంచాయతీ పోరు: 9 గంటల వరకు 19.58 శాతం పోలింగ్

11-12-2025 10:13:29 AM

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల(Telangana Gram Panchayat Elections ) తొలి దశ పోలింగ్ ప్రారంభమై ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 19.58 శాతం పోలింగ్(Polling Percentage) నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. 3,834 సర్పంచ్ స్థానాలకు, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగనుంది. మొత్తం 37,562 పోలింగ్ కేంద్రాలలో 56,19,430 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.పోలింగ్ ముగిసిన వెంటనే మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటించబడతాయి.