11-12-2025 10:16:01 AM
రెండు గంటల్లో 18.10 శాతం పోలింగ్ నమోదు .
వెల్డండ మండలం కుప్పగండ్లలో నిలిచిన పోలింగ్.
వెబ్ క్యాస్టింగ్ ద్వారా పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్
నాగర్ కర్నూల్, (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లాలో(Nagar Kurnool district) గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి విడతలో భాగంగా ఆరు మండలాల పరిధిలోని 1,118 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ప్రారంభం నుంచి ఎటువంటి అంతరాయం లేకుండా ఎన్నికల ప్రక్రియ పూర్తిగా సజావుగా కొనసాగుతున్నదని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు.
వెల్దండ మండలం కుప్పగండ్ల గ్రామంలోని పదో వార్డులోని ఓ అభ్యర్థి గుర్తు బ్యాలెట్ పేపర్ పై నమోదు చేయకపోవడంతో ఎన్నిక ప్రక్రియను నిలిపివేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభ రెండు గంటల్లోనే జిల్లావ్యాప్తంగా 32,533 ఓట్లు 18.10 శాతం పోలింగ్ నమోదైంది. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం ద్వారా వెబ్ క్యాస్టింగ్‌ను ప్రత్యక్షంగా పరిశీలిస్తూ, ఓటింగ్ కేంద్రాల్లో జరుగుతున్న పరిస్థితులను కలెక్టర్ సమీక్షించారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో శాంతి భద్రతలు పకడ్బందీగా ఉన్నాయన్నారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో ఎన్నికల నిర్వహణ జాగ్రత్తగా జరుగుతోందని కలెక్టర్ పేర్కొన్నారు.