11-12-2025 09:23:38 AM
గుంజపడుగు, రచ్చపల్లి
మంథని,(విజయక్రాంతి): నేడు మెదటి విడుత పంచాయితీ ఎన్నికలు జరుగుతున్న పొలింగ్ బూత్ లను పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి, గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ తో కలిసి పరిశీలించారు. మంథని మండలంలోని గుంజపడుగు, రచ్చపల్లి ఏర్పాటు చేసిన పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి పోలీస్ బందోబస్త్ తో పాటు మౌలిక వసతుల ఏర్పాట్లను పరిశీంచారు. ఈ కేంద్రంలో ఎన్నికలు జరుగుతున్న తీరును పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.