calender_icon.png 16 September, 2025 | 8:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

గ్రామ పంచాయతీ ఓటరు ముసాయిదా విడుదల

13-09-2024 06:04:18 PM

యాదాద్రి భువనగిరి,(విజయక్రాంతి): గ్రామ పంచాయతీల వారీగా ఓటరు ముసాయిదా జాబితా విడుదల చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ హనుమంత్ కే.జెండగే ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ఎన్ని కల కమిషన్ ఆదేశాల మేరకు ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేయడం జరిగిందని, గ్రామ పంచాయతీలు, ఎంపీడీవో కార్యాలయాలు, జిల్లా కలెక్టరేట్లో జాబితాలను ప్రదర్శించడం జరిగిందన్నారు. ఓటరు ముసాయిదా జాబితాపై రేపు 14వ తేదీ నుంచి 21 వరకు అభ్యంతరాలు స్వీకరించామని, 26వ తేదీన వాటిని పరిష్కరించామని పేర్కొన్నారు. ముసాయిదా ఓటర్ల జాబితాల సవరణపై ఈనెల 18 తేదీన జిల్లాస్థాయిలో, 19 తేదీన మండల స్థాయిలో రాజకీయ పార్టీలతో సమావేశాలు ఏర్పాటుచేసి వారి సూచనలు, సలహాలు తీసుకున్నామని వెల్లడించారు. 28వ తేదీన తుది ఓటరు జాబితా విడుదల చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.