calender_icon.png 16 October, 2024 | 1:17 AM

జాగృతిలో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు

13-09-2024 05:56:00 PM

ముఖ్య అతిధిగా మహాత్మా గాంధీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ అల్వాల రవి

యాదాద్రి భువనగిరి,(విజయక్రాంతి): భువనగిరి పట్టణంలోని జాగృతి డిగ్రీ మరియు పీజీ కళాశాల స్వాగతోత్సవ వేడుకలను స్థానిక ఏ.ఆర్ . గార్డెన్స్ లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డా,సూర్య నారాయణ రెడ్డి మాట్లాడుతూ... విద్యార్థులు చదువుతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు క్రీడలు తదితర రంగాలలో కూడా ముందంజలో ఉండాలని సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ అనే భూతంతో వేధింపులకు గురి చేయకుండా సోదర భావంతో మెలుగుతూ పై చదువుల నిమిత్తం సూచనలు సలహాలు ఇవ్వాలని తెలియజేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహాత్మా గాంధీ యూనివర్సిటీ రిజిస్టార్ ప్రొఫెసర్ అల్వాల రవి  మాట్లాడుతూ విద్యార్థులు విద్యను డిగ్రీతోనే కాకుండా ఉన్నత స్థాయి చదువులను చదివి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని,  ప్రతి సంవత్సరం మహాత్మా గాంధీ యూనివర్సిటీలో నిర్వహించే క్రీడలు, జాతీయస్థాయి ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలలో జాగృతి విద్యార్థులు ఎంపిక అవుతున్నట్లు తెలియజేస్తూ, చదువుకున్న కళాశాలకు, అధ్యాపకులకు తల్లిదండ్రులకు, మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల ఆటపాటలు, మిమిక్రీ, నాటికలు, సాంప్రదాయక వేషధారణ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ సింగన బోయిన మల్లేశం, కళాశాల చైర్మన్ బాలకృష్ణ రెడ్డి, కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఏ మణిపాల్ రెడ్డి, అకాడమిక్ కోఆర్డినేటర్ సిహెచ్ నవీన్, అధ్యాపకులు శ్రీధర్, బాలేశ్వర్, ఎల్మారెడ్డి, వెంకట రమణ బసవరాజు, సుధా కిషోరి, వేణు రెడ్డి, వెంకటేష్, ఉపేందర్ రెడ్డి, సాయిరాం, జ్యోతి, శ్రావణి, శ్రీష శైలేష్, శంకర్, అన్వర్, మహేష్ నవీన్, రాజు, సోనీ, బాలరాజు  ఇస్తారి శివ, ఖలీద్ తదితరులు పాల్గొన్నారు.