calender_icon.png 14 August, 2025 | 2:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుదాఘాతంతో గ్రామ పంచాయతీ కార్మికుడు మృతి

14-08-2025 12:30:32 PM

చేర్యాల: సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని వెచరేణి గ్రామంలో గురువారం నాడు ఉదయం 10 గంటల సమయమున విద్యుత్ ఘాతంతో గ్రామ పంచాయతీ కార్మికుడు(Gram Panchayat worker ) జెండా ఆవిష్కరణ కోసం పైపును సిద్ధం చేస్తుండగా మృతి చెందినాడు.మృతిని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం వెచరేణి గ్రామానికి చెందిన మహమ్మద్ మోహిన్ పాషా(32) గ్రమపంచాయితీ లో గత పది సంవత్సరాలుగా  కార్మికుడిగా పనిచేస్తున్నాడని ఇతనికి భార్య ఒక కుమారుడు ఇద్దరకుమార్తెలు ఉన్నారు. జాతీయ జెండా ఆవిష్కరణ చేసేందుకు జెండా పైపును శుభ్రం చేసే క్రమంలో పైపును పైకి లేపగా ప్రమాదవ శాత్తు పైన ఉన్న 11కేవీ కరెంటు వైర్లకు తాకడంతో విద్యుత్ షాక్ తగలడంతో వెంటనే చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రి కి తీసుకోని రాగా అతడిని పరీక్షించిన డాక్టర్ చనిపోయాడు అని నిర్ధారించారు.