5 August, 2026 | 2:46 AM

కోరం లేక గ్రామసభ వాయిదా

05-08-2026 01:34 AM

ములుగు, ఆగస్టు 4 (విజయక్రాంతి): మంగపేట మండల కేంద్రంలో గోదావరి ఒడ్డున కరకట్ట నిర్మాణం కోసం మంగళవారం నిర్వహించాల్సిన పెసా గ్రామ సభ సరైన కోరం లేక వాయిదా పడింది. మంగపేట గ్రామ పంచాయతీ పరిధిలో గోదావరి ఒడ్డున కరకట్ట నిర్మాణ విషయంలో పెసా గ్రామ సభ తీర్మానం కోసం ములుగు ఆర్డీఓ కృష్ణవేణి ఆదేశాల మేరకు మంగపేట తహశీల్దార్ తోట రవీందర్ ఆధ్వర్యంలో మండలంలోని రైతు వేదికలో నిర్వహించిన పెసా గ్రామ సభకు ఏటూరునాగారం ఐటీడీఏ పెసా కో ఆర్డినేటర్ కొమురం ప్రభాకర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

మంగపేట గ్రామ పంచాయతీ పరిధిలో మొత్తం 349 మంది గిరిజన ఓటర్లు ఉండగా మంగళవారం నిర్వహించిన పెసా గ్రామ సభకు కేవలం 20 మంది మాత్రమే హాజరయినట్లు అధికారులు తెలిపారు. గ్రామ సభ నిర్వహించాలంటే గ్రామంలోని గిరిజన ఓటర్లలో మూడవ వంతు 117 మంది హాజరు కావాలి. దీంతో కోరం లేకపోవడంతో నిభందనల ప్రకారం గ్రామ సభను వాయిదా వేస్తున్నట్లు, తిరిగి ఆగస్టు 6 న గ్రామ సభ  నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.