27 August, 2026 | 2:47 AM

ఇబ్రహీంపట్నం మండలంలో నేటి నుంచి గ్రామసభలు

27-08-2026 12:24 AM

‘సర్’పై ఓటర్లకు అవగాహన సదస్సులు : ఎమ్మార్వో సునీతారెడ్డి

ఇబ్రహీంపట్నం, ఆగస్టు 26 (విజయక్రాంతి): మండల పరిధిలోని 36 పోలింగ్ స్టేషన్ల పరిధిలోని గ్రామపంచాయతీ ల్లో నేటి నుంచి ‘సర్2026’పై గ్రామసభలు, ప్రత్యేక అవగా హన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ సునీతారెడ్డి తెలిపారు. ఓటరు జాబితా పరిశీలన, కొత్త ఓటు నమోదు, మార్పులు-చేర్పులు మరియు అభ్యంతరాల నమోదుపై ఈ సభల్లో అధికారులు ప్రజలకు సమగ్ర అవగాహన కల్పించనున్నారు.

ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ అక్టోబర్ నాటికీ 18 ఏళ్ళు నిండే యువతీ యువకులు ’ఫారం6’ ద్వారా మీ-సేవలో కొత్త ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.ఫారం6 (18 ఏళ్లు నిండిన వారు కొత్త ఓటు కు దరఖాస్తు చేసుకోవాలని, ఫారం8 ప్రకారం పేరు, చిరునామా, వయస్సు సవరణలకు అవకాశం ఉందన్నారు.

ఫారం7 అనర్హుల పేర్ల తొలగింపుకు ఓటర్లు తమ వివరాలను సక్రమంగా సరిచూసుకోవాలని, ఏవైనా లోపాలు ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. పారదర్శకమైన ఓటరు జాబితా రూపకల్పనకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని తహసీల్దార్ విజ్ఞప్తి చేశారు.