27 August, 2026 | 2:41 AM

తూకం దడ్వాయిలకు కనీస వేతనాలు అమలు చేయాలి

27-08-2026 12:13 AM

ఐఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శులు నాగన్న గౌడ్, చంద్రశేఖర్ 

ముషీరాబాద్, ఆగస్టు 26 (విజయక్రాం తి): వ్యవసాయ మార్కెటింగ్ తూకం దడ్వా యి కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయడంతో పాటు వారిని స్కిల్ లేబర్గా గుర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వై. నాగన్న గౌడ్, ఆర్.డి. చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ దడ్వాయిల యూనియన్ రాష్ట్ర కమిటీ సమావేశం బుధవారం నారాయణగూడలోని ఐఎన్టీయూసీ రాష్ట్ర కార్యాలయంలో యూనియన్ అధ్యక్షుడు ఎస్. సురేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా సెప్టెంబర్ 8న హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సదస్సు ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తూకం ఛార్జీలను పారదర్శకంగా చెల్లించాలని, లైసెన్స్ కలిగిన దడ్వాయిలకు నిబంధనల ప్రకారం పని కల్పించాలని, రూల్ 57ను కచ్చితంగా అమలు చేయాలని నాయకులు కోరారు.

సదస్సుకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కార్మిక శాఖ మంత్రి వివేక్, పీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్, జాతీయ ఐఎన్టీయూసీ అధ్యక్షుడు డాక్టర్ జి. సంజీవరెడ్డి హాజరవుతారని తెలిపారు. సదస్సును విజయవంతం చేసేందుకు అన్ని జిల్లాల నుంచి దడ్వాయిలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేనావత్ రవి కుమార్, కోశాధికారి బి. వీరన్న, ఉపాధ్యక్షుడు సంజీవ్, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్, బిక్కన్ అలీ తదితరులు పాల్గొన్నారు.