27 August, 2026 | 2:47 AM

ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తా

27-08-2026 12:29 AM

ఎమ్మెల్యే యాదయ్య

చేవెళ్ళ ఆగష్టు 26(విజయక్రాంతి): చేవెళ్ల మున్సిపల్ కేంద్రం రచ్చబండ గ్రామపుర వీది 15వార్డుల్లో రూ. 10లక్షలతో  చేపట్టిన సిసి రోడ్ల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే కాలే యాదయ్య మునిసిపల్ చైర్మన్ దేవర సమ త వెంకట్ రెడ్డి వార్డు కౌన్సిలర్ బండారు శైలజ నాగిరెడ్డి స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. అనంతరం దండు మానె మ్మ నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఆ తర్వాత మోడల్ కాలనీలో చేపట్టిన వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.

అనం తరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఎమ్మెల్యేగా ఆదరించిన ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తానన్నారు. మున్సిపల్ లోని వార్డు ప్ర జలకు మౌలిక సదుపాయాల కల్పనే ధ్యే యంగా సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టామన్నా రు. ఇల్లు లేని నిరుపేదలకు ‘ఇందిరమ్మ ఇ ల్లు‘ పథకం గ్రామాలలో ఎంతోమందికి తో డ్పాటు అందిస్తుందన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగానే  ప్రభుత్వం వనమహో త్సవ కార్యక్రమం చేపట్టిందన్నారు.

నియోజకవర్గ అభివృద్ధి కొరకు నిధులు మ ంజూ రు చేయాలని సీఎం కోరుతానన్నారు. ఈ కా ర్యక్రమంలో పిఏసిఎస్ చైర్మన్లు దేవర వెంకటరెడ్డి గోనె ప్రతాపరెడ్డి కౌన్సిలర్లు గోపాల్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి శ్రీనివాస్, మనిషా అనంతరెడ్డి నాయక్, నరసింహులు, కో -ఆప్షన్ మెంబర్ చాన్ పాషా, సర్పంచుల సం ఘం అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, సర్పంచులు ప్రభాకర్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు గిరిధర్ రెడ్డి, మున్సిపల్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ వార్డు సభ్యులు పాల్గొన్నారు.