2 July, 2026 | 4:03 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •  

ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లు

02-06-2025 01:21 AM
  1. త్రివర్ణ  పతాకం రంగుల పని విందు చేస్తున్న విద్యుత్ లైట్లు 

ఇందిరాగాంధీ స్టేడియంలో ఉత్సవాలకు ఏర్పాట్లు 

కామారెడ్డి, జూన్ 1(విజయ క్రాంతి), కామారెడ్డి జిల్లా కేంద్రంలో రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కలెక్టరేట్ కార్యాలయం ఎస్పీ కార్యాలయం విద్యుత్ దీపాల అలంకరణతో విద్యుత్తు లైట్ల వెలుగులతో కనువిందు చేస్తున్నాయి. త్రివర్ణ పతాకం అలంకరణలో విద్యుత్ లైట్లు అలంకరించడంతో జండా వాతావరణం తలపిస్తుంది.

ఇందిరా గాంధీ స్టేడియంలో రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ రమేష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ ఉత్సవాల్లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్, ఎస్పి రాజేష్ చంద్ర ,స్థానిక ఎమ్మెల్యే  కాటిపల్లి వెంకటరమణారెడ్డి తో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, జిల్లా అధికారు లు పాల్గొననున్నారు.

వివిధ శకటాలు ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉత్తమ సేవలందించిన అధికారులకు ప్రశంసా పత్రాలను అందించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిధి రమేష్ రెడ్డి చేతుల మీదుగా ప్రశంస పత్రాలను అధికారులకు అందించనున్నారు.