02-06-2025 01:27:06 AM
ఘట్ కేసర్, జూన్ 1 (విజయ క్రాంతి): త్వరలో నూతన టెక్నాలజీతో వంద ఫీట్ల రోడ్డు పనులు ప్రారంభం కానుండడంతో ఘట్కేసర్ పట్టణం దిశ మారిపోతుందని మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ ముల్లి పావని జం గయ్య యాదవ్ అన్నారు. ఘట్కేసర్ పట్టణంలోని శివారెడ్డిగూడ నుండి మాధవరెడ్డి బ్రిడ్జి వరకు దాదాపు రూ. 30 కోట్ల నిధులతో 2.5 కిలోమీటర్ల రోడ్డు ట్రైయల్ ప నులను మాజీ చైర్మన్ పావని జంగయ్యయాదవ్ స్థానిక నాయకులతో కలసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 100 ఫీట్ల రోడ్డు పనులు ప్రారంభం కావడం హర్షనీయమని, ఇట్టి రోడ్డు కోసం కోరిన వెంకటనే స్పందించి గత సంవత్సరం ప్రజాపాలన విజయో త్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నిధులు మంజూరు చేయడం, దానికి సహకరించి నడిపించిన నియోజకవర్గం ఇంచార్జీ తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
కొత్త టెక్నిలజీతో చేపడుతున్న రోడ్డు పనులకు రోడ్డుకు ఇరువై పుల ఉన్న ప్రజలు సహకరించాలని కోరారు. రూ. 30 కోట్లతో 2.5 కిలోమీటర్ల పొడువు 100 ఫీట్ల రోడ్డుతో పాటు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారని, దీనితో ఘట్కేసర్ పట్టణం ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు.
ఈకార్యక్రమంలో మున్సిపల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ ముదిరాజ్ , మాజీ కౌన్సిలర్ కడుపోల్ల మల్లేష్, డిసిసి కార్యదర్శి ఉల్లి అంజనేయులుయాదవ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొక్క సంజీవరెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు మోత్కుపల్లి శ్రీనివాస్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఫారుక్, నాయకులు రెహమాన్, ఖయ్యూం, బాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.