6 August, 2026 | 2:31 AM

ఘనంగా బోనాల సంబురాలు

06-08-2026 12:00 AM

అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన డిప్యూటీ కమిషనర్లు రవీంద్ర సాగర్, నిత్యానందన్

ఉప్పల్, ఆగస్టు 5 (విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాప్రా, నాచారం సర్కిల్ కార్యాల యాల్లో ఆషాఢమాస బోనాల ఉత్సవాలు బుధవారం వైభవంగా నిర్వహించారు. కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవీంద్ర సాగర్, నాచారం సర్కిల్ డిప్యూటీ కమిషనర్ నిత్యానందన్ ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు, బోనాల సమర్పణ కార్యక్రమాలు భక్తిశ్రద్ధల మధ్య జరిగాయి.

ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్లు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళా ఉద్యోగులు సంప్రదాయ వస్త్రధారణలో బోనమెత్తి అమ్మవారికి బోనాలు సమర్పించారు. టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, శానిటేషన్, పారిశుధ్య విభాగాల అధికారులు, సిబ్బంది అమ్మవారి పాటలకు నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా సంబరాల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వ హించారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ ఏసీపీ కళ్యాణి రాణి, సెక్షన్ ఆఫీసర్లు తుల్జా సింగ్, చైన్మాన్ శ్రీధర్, రాజు కుమార్, రాజు, రమేష్, గిరి, ఎల్లయ్య, నరేష్, శివాజీతో పాటు పలువురు మున్సిపల్ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.