ఘనంగా ఆషాఢ బోనాలు
10-08-2026 12:44 AM
మొయినాబాద్, ఆగస్టు 9(విజయక్రాంతి): మండలంలోని పలు గ్రామాలు, మున్సిపాలిటీలో ఆదివారం ఆషాఢ బోనాల పండుగను ఘనంగా జరుపుకున్నారు. మహిళలు సాంప్రదాయ వస్త్రధారణతో తలపై బోనాలు ఎత్తుకుని ఊరేగింపుగా ఆలయాలకు చేరుకుని అమ్మవారికి బోనాలు భక్తిశ్రద్ధలతో సమర్పించారు. ప్రత్యేక డప్పు చప్పుళ్లు, మేళతాళాలు, చిన్నారుల సాంప్రదాయ వేషధారణలు, పోతురాజుల నృత్యాల నడుమ ఉత్సవాలు కోలాహలంగా నిర్వహించారు. వేడుకల్లో కౌన్సిలర్ లక్ష్మీ వెంకట్రెడ్డి, శ్రీధర్, జైపాల్రెడ్డి, విక్రమ్రెడ్డి, మహేష్గౌడ్, మల్లేష్గౌడ్, ఈగ వెంకట్రెడ్డి, ఎట్టాయా గౌడ్, రాజు, రమేష్గౌడ్, యాదిరెడ్డి, భాస్కరచారి, బ్యాగరీ శ్రీనివాస్, మహేందర్రెడ్డి తదితర ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.






