స్లాబ్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎంఆర్
పటాన్చెరు, ఆగస్టు 9 (విజయక్రాంతి): డివిజన్ పరిధిలోని జేపీ కాలనీ, ఆల్విన్ కాలనీ బండల మల్లన్న దేవాలయం పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న వ్యాపార సముదాయం స్లాబ్ నిర్మాణ పనులను ఆదివారం ఉదయం పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి, నిర్వహణ కోసం సొంత నిధులతో వ్యాపార సముదాయ భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు.
అనంతరం ఆల్విన్ కాలనీ ఎల్లమ్మ తల్లి, పోచమ్మ తల్లి దేవాలయాలలో నిర్వహించిన ఆషాడమాసం బోనాల ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, మల్లేష్ యాదవ్, ఆలయ కమిటీ సభ్యులు, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






