ఘనంగా తూప్రాన్‌లో శ్రీ ఉజ్జ్జయనీ మహంకాళి అమ్మవారి జాతర ఉత్సవాలు
*జాతరలో బోనం ఎత్తిన మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి
తూప్రాన్, ఆగస్ట్ 9 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆషాఢ మాసంలో అమ్మవార్లకు బోనాల జాతర ఉత్సవాలు జోరుగా కొనసాగుతాయి. ఈనేపథ్యంలో మాజీ డిప్యూటీ స్పీకర్ మెదక్ మాజీ ఎంఎల్‌ఏ పద్మా దేవేందర్ రెడ్డి తూప్రాన్ పట్టణంలో మూడు రోజులపాటు జరుగుచున్న శ్రీ శ్రీ ఉజ్జియనీ మహంకాళి దేవి జాతర ఉత్సవాలలో మొదటిరోజు పాల్గొన్నారు.
ముందుగా మున్సిపల్ ఆఫీసు నుండి అమ్మవారికి బోనం సమర్పించుటకు పద్మా దేవేందర్ రెడ్డి బోనం ఎత్తారు. అక్కడ నుండి ర్యాలీగా వస్తూ అమ్మవారి సన్నిధానం లో బోనం సమర్పించారు. అనంతరం అమ్మవారి ఆశీర్వాదం పొందారు. తూప్రాన్ పట్టణం పలు వీధుల గుండా మహిళ తల్లులు అమ్మవారికి బోనాలను సమర్పించుటకు డప్పు సప్పులతో శివశక్తుల పూనకాలతో దారిపోడుగున కదిలారు. ఇందులో మున్సిపల్ నాయకులు, అధికారులు, తదితరులు ఉన్నారు.






