10 August, 2026 | 3:15 AM

శ్రావణమాసంలో బాలాలయంలో ప్రత్యేక పూజలు

10-08-2026 02:02 AM

భక్తులకు అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు

కాళేశ్వరం ఆగస్టు 9 (విజయ క్రాంతి): శ్రావణమాసం పురస్కరించుకొని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం బాలాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ మోహన్ శర్మ, ఈవో ఎస్ మహేష్ తెలిపారు. ఆలయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తాగునీరు, క్యూలైన్లు తదితర ఏర్పాట్లు చేయాలని ధర్మకర్తల సమావేశంలో నిర్ణయించారు. శ్రావణమాసంలో రెండవ శుక్రవారం వరలక్ష్మీ వ్రతాలు, మాస శివరాత్రి సందర్భంగా మహాలింగార్చన పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు.