ఘనంగా బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి
పాల్గొని నివాళులర్పించిన వివిధపార్టీలు నాయకులు..
సికింద్రాబాద్, ఆగస్టు18 (విజయక్రాంతి): సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చూపిన ధైర్యం, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, సమానత్వం వంటి విలువలను తెలంగాణ సమాజం ముందుకు తీసుకెళ్లాలని జంపన ప్రతాప్ పిలుపునిచ్చారు. బహుజన వీరుడు, సామాజిక సమానత్వం కోసం పోరాడిన ధీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి సందర్భంగా న్యూ బోయిన్ పల్లి లో గౌడ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే శ్రీ గణేష్, జంపన ప్రతాప్, మల్లారెడ్డి, జక్కుల, పాండు యాదవ్, టి.ఎన్. శ్రీనివాస్,బానుక మల్లికార్జున్,బిఎన్ శ్రీనివాస్, గౌడ్ సంఘం నాయకులు విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ మొఘలులకు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసి స్వంత సైన్యం ఏర్పాటు చేసి భువనగిరి వరంగల్ కోట లతో బాటు మొఘలుల ఆధీనంలో ఉన్న గోల్కొండ కోట ను స్వాధీనం చేసుకున్న గొప్ప పోరాట యోధుడని ప్రతాప్ అన్నారు. అనంతరం పాండు యాదవ్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ నాటి సామాజిక, ఆర్థిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడి అణగారిన వర్గాల్లో ఆత్మగౌరవం, ధైర్యం, సమానత్వ భావనను పెంపొందించిన మహనీయుడని పాండు యాదవ్ పేర్కొన్నారు. పేదలు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం నేటి తరాలకు స్ఫూర్తి దాయకమని అన్నారు.
ఈ సందర్భంగా బానుక మల్లికార్జున్ మాట్లాడుతూ 17వ శతాబ్దంలోనే సర్వాయి పాపన్న గౌడ్ సామాజిక అసమానతలు,అణచివేతను ఎదిరించి ప్రజల కోసం పోరాడారు.సర్వాయి పాపన్న గౌడ్ జీవితం మనకు ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది తెలియజేస్తూ పరిస్థితులు ఎంత క్లిష్టంగా ఉన్నప్పటికీ, ప్రజల పక్షాన నిజాయితీగా నిలబడితే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే కీర్తిని పొందవచ్చని పాపన్న నిరూపించారు అన్ని భానుక మల్లికార్జున్ అన్నారు.
ఈ సందర్భంగా టి.ఎన్ శ్రీనివాస్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తాటికొండ, వరంగల్, భువనగిరి, కొలనుపాక తదితర ప్రాంతాల్లో తన ఆధిపత్యాన్ని విస్తరించి, గోల్కొండపై సైతం దండయాత్ర చేసి అప్పటి మొఘల్ పాలకు లకు సవాల్ విసిరిన బహుజన వీరుడు అని టి.ఎన్.శ్రీనివాస్ కొనియాడారు. అనంతరం జక్కుల మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వీరత్వాన్ని, సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటాన్ని భవిష్యత్ తరాలకు తెలియజేయడం మనందరి బాధ్యత. అన్ని జక్కుల మహేశ్వర్ రెడ్డిఅన్నారు.






