19 August, 2026 | 2:46 AM

రవీంద్రభారతిలో సెప్టెంబర్ 7న విశ్వజన కళామండలి స్వర్ణోత్సవ వేడుకలు

19-08-2026 01:42 AM

ఉత్సవ కమిటీ చైర్మన్ జేబీ రాజు 

ముషీరాబాద్, ఆగస్టు18 (విజయ క్రాంతి): విశ్వజన కళామండలి 50వ ఆవిర్భావ దినోత్సవం, మహాకవిగాయకులు డా. గంగాధరి మాస్టార్జీ 75వ జన్మదిన వజ్రో త్సవం సందర్భంగా సెప్టెంబర్ 7న హైదరాబాద్ రవీంద్రభారతిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ చైర్మన్ జె.బి. రాజు తెలిపారు. మంగళవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఉత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్ ను వారు ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జేబి రాజు మాట్లాడుతూ ఉదయం10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ వేడుకల్లో మాస్టార్జీ సాహిత్య, సంగీత, కళా రంగాల్లో చేసిన సేవలను స్మరించుకోను న్నారు.

1977లో ఆయన రచించి, స్వయంగా ఆలపించిన అందుకో దండాలు  బాబా అంబేద్కరా పాటకు 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వ హించ నున్నట్లు తెలిపారు. బహుజన మహనీయుల ఆశ యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మాస్టార్జీ రూపొందించిన జనకథ కళారూపం దేశంలోని పలు రాష్ట్రాలతో పాటు దక్షిణా ఫ్రికా, ఆస్ట్రేలియా, నేపాల్లోనూ ప్రదర్శించ బడిందని నిర్వాహకులు పేర్కొన్నారు. అలాగే 2010లో 100 గొంతులు1000 డప్పులు కార్యక్రమంతో డప్పు కళకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకువచ్చారని తెలిపారు.

ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్టీఎస్ అధికారులు, కవులు, కళాకారులు, గాయకులు, మేధావులు, అభిమానులు హాజరుకావాలని ఉత్సవ కమిటీ కోరింది. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేసింది.

మాస్టార్జీకి సంబంధించిన అరుదైన ఫొటోలు, విశేషాలను 9866630022 నంబర్కు పంపాలని, ఎంపికైన వారికి బహుమతులతో పాటు స్వర్ణోత్సవంలో సన్మానం చేస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ సమావేశంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.  విరాహత్ అలీ, గొల్లపల్లి దయానందరావు, విజిఆర్ నారగోని, తలకొక్కుల రాజు, ముప్పారపు ప్రకాష్, అమృత్ కుమార్, పి. జంగయ్య ముదిరాజ్, మేకల పోచయ్య, దాసరి యాదగిరి, నల్ల సూర్యప్రకాష్ రావు, పి. నరసింహ రాజు, అందం రాజు, సీఎల్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.