12 May, 2026 | 11:22 PM

Breaking News

భధ్రాచలంలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు   •   హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •  

వైభవంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి

27-04-2026 12:41 AM

నవాబ్ పేట్ ఏప్రిల్ 26: మండల కేంద్రంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు ఆదివారం భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఉదయం నుంచే వేద పండితులు అమ్మవారికి పంచామృత అభిషేకాలు, అష్టోత్తర శతనామావళి పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

పువ్వులతో సర్వాంగ సుందరంగా అలంకరించిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆర్యవైశ్య సంఘం నాయకులు ప్రేమ్ సుధాకర్, బచ్చు బాలరాజ్, కలివ నరసింహులు తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వివిధ ఆర్యవైశ్య విభాగాల సమన్వయంతో వేడుకలు దిగ్విజయంగా చేయడం తోపాటు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.